లోక్‌ సభ నుంచి డీఎంకే ఎంపీల వాకౌట్‌..! 1 y ago

featured-image

డీలిమిటేషన్‌ అంశంపై చర్చకు అనుమతించకపోవడంతో మంగళవారం లోక్‌ సభ నుంచి డీఎంకే ఎంపీలు వాకౌట్‌ చేశారు. సభ సమావేశమైన వెంటనే, ప్రశ్నోత్తరాల సమయంలో డీలిమిటేషన్‌ అంశాన్ని లేవనెత్తడానికి డీఎంకే నేతలు ప్రయత్నించారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత వారిని మాట్లాడటానికి అనుమతిస్తామని లోక్‌ సభ స్పీకర్‌ ఓంబిర్లా పేర్కొన్నారు. కాగా, ఈ అంశాన్ని లేవనెత్తేందుకు సమయం ఇవ్వలేదని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. తమిళనాడు ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD